చేతులు లేవని అడ్మిషన్ ఇవ్వలేదు.. ఐపీఎస్ లక్ష్యంగా చదువు.. ఈ చిన్నారి టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
మన రియల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఎన్నో ఘటనలు మనల్ని కదిలిస్తూ ఉంటాయి.
అయితే మనలో చాలామంది వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో ఇతరుల సమస్యలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వబోమనే సంగతి తెలిసిందే.
రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆదోనికి( Adoni ) చెందిన చిన్నారికి చేతులు లేవనే కారణం చూపుతూ ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్( Private School Admission ) ఇవ్వలేదు.
అయితే ఆ చిన్నారి మాత్రం ఉన్నత చదువులు చదవాలనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదివి( Govt School ) మంచి మార్కులు సాధిస్తోంది.
అంగ వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని భవిష్యత్తులో ఐపీఎస్( IPS ) కావడమే తన లక్ష్యమని ఆ చిన్నారి చెబుతూ ఎంతోమంది ప్రశంసలను అందుకుంటున్నారు.
ఈ చిన్నారి పేరు ఫరీదా భాను( Farida Bhanu ) కాగా చేతులు లేకుండా జన్మించిన ఈ చిన్నారి తన ప్రతిభతో విమర్శించిన వాళ్ల నోర్లను మూయించారు.
"""/" /
తమ కూతురుకు చేతులు లేవని ఒకప్పుడు బాధ పడిన తల్లీదండ్రులు తమ గౌరవాన్ని మరింత పెంచడం కోసం కూతురు కష్టపడి చదువుతూ రాణిస్తుండటంతో ఫిదా అవుతున్నారు.
చేతులు లేకపోయినా ఈ చిన్నారి కొన్ని గేమ్స్ ను అద్భుతంగా ఆడుతూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.
ఈ చిన్నారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/" /
సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని షేక్ ఫరీదా భాను ప్రూవ్ చేశారు.
రెండు చేతులు లేకుండా పుట్టినా సక్సెస్ కావడానికి( Success ) అది సమస్య కాదని ఫరీదా భాను నిరూపించారు.
కుటుంబ సభ్యులు ఈ చిన్నారిని కంటికి రెప్పల చూసుకుంటూ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు.
కాలితోనే నోట్స్ రాస్తున్న ఈ చిన్నారికి భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
షేక్ ఫరీదా భాను అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
భారత్ – కెనడా ఉద్రిక్తతలు .. హిందూ పతాకాన్ని ఎగురవేసిన భారత సంతతి ఎంపీ