రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తుంది.వడ్లు కొనుగోలు చేసే 2900 మిల్లర్లపై తనిఖీలు.
వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే ఈ తనిఖీలు.రైతుల నుండి వడ్లు కొనుగోలు తర్వాతే ఎఫ్ సీఐ మిల్లర్లపై తనిఖీలు చేపట్టాలి.
దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది.కాని తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుంది.
కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2900 రైస్ మిల్లుల దాడులు చేయిస్తోంది.ఒక నెల ఆగి దాడులు చేస్తే ఎము అవుతుంది.
దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రైతులు నష్టపోవాలి వడ్లు కొనవద్దు అన్న కారణంతో ఎఫ్ సీఐ అధికారులతో దాడులు చేయిస్తోంది.
మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు.లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు.
మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు.ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుద్ది.
మీ ఉద్దేశం ఏంటి.వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి.
రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు.కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది.
దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నం.రైతు సోదరులు దీన్ని గమనించాలి.2990 మీద రైడ్ చేస్తరా.ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది.
తడిస్తే రైతులు ఇబ్బంది పడేలా, తెలంగాణ ప్రభుత్వంపై కోపం వచ్చేలా కుట్రలు చేస్తోంది.