విశాఖపట్నం, ఆగస్టు 16: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటన, మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.పవన్ కళ్యాణ్ బుధవారం ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన అనంతరం మాట్లాడిన మాటలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు.
ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.అక్కడ విఎంఆర్డిఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అనిఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.” మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది.” అని అమర్నాథ్పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు.చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి మీ పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని అమర్నాథ్ కోరారు.ఆయన ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో , ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, మోడీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాల్ పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.” మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి” అని అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు
.