సీబీఐ ఎంక్వైరీ కోరుతూ ' ఈటెల ' సంచలనం

టిఆర్ఎస్ పెద్దలతో మంత్రి ఈటెల రాజేందర్ కు  వ్యవహారం చేసినట్టు గా కనిపిస్తోంది.

దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా లో ఈటెల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలు పై కథనాలు వచ్చాయి.

దీంతో త్వరలోనే ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.దీనిపైన ఈటెల ఘాటుగానే స్పందించారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ కట్టు కథనాలతో తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని,  ఎవరి చరిత్ర ఏమిటో తనకు తెలుసునని,  తాను నిజంగా అక్రమాలు చేసి ఉంటే,  తనపై సిబిఐ ఎంక్వైరీ వేయించాలని,  అలాగే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలంటూ ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.  తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్ష అనుభవించేందుకు అయినా సిద్ధమని, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ముందు ఏ పని పెద్దది కాదు అంటూ వ్యాఖ్యానించారు.

తాను కోళ్ల ఫారాల వ్యాపారంతో ఈ స్థాయికి వచ్చాను అని,  తాను స్కూటర్ పై తిరిగి వేల కోట్లు సంపాదించి లేదని, స్కూటర్ పై తిరిగి న వాళ్లు వేల కోట్లకు ఎలా ఎదిగారు .ఒక్క సిట్టింగ్ లోనే వందలు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు.వాళ్ళకు ఆ సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చినయ్ ?  నా చరిత్ర మీద నా ఆస్తుల మీద విచారణ చేయండి,  తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని,  విజిలెన్స్ విచారణ చేయడానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది.  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు సమాజానికి చెప్పాలంటూ ఈటెల ఘాటుగా స్పందించారు.

Advertisement

చేతికి వాచ్, రేమండ్ గ్లాస్ పెట్టుకునే అలవాటు తనకు లేదని,  తన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి అవాస్తవ కథనాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు .దేశంలో,  రాష్ట్రంలో ఎన్ని విచారణ సంస్థలు ఉంటే అన్నిటితోనూ తనపై విచారణ చేయించాలని,  తాను ఆరు లక్షలకు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఎప్పుడో కొన్నాను అని, దీనిపై అనుమానం ఉంటే ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు అని అన్నారు.తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కొన్ని ఛానళ్లు పెయిడ్ మీడియా గా వ్యవహరిస్తున్నాయి అంటూ ఈటెల ఘాటుగా రియక్ట్ అయ్యారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు