మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 225 కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి, శామీర్ పేట్, మేడ్చల్ మండలాలతో పాటు తూంకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపీలిటీల్లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని లబ్ది దారులకు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ పెళ్లి అయితే కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ఒక పెద్దన్న లాగా, మ్యానమామలాగ లక్షా 116 రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో రైతు బంధు, ఆసరా ఫించన్, దళిత బంధు వంటి పథకాలతో దేశంలోనే నంబర్ వన్ సీఎం అయ్యారని కొనియాడారు.
కేసీఆర్ టార్గెట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారని ప్రశ్నించారు.బీజేపీ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, దళిత బందు పథకాలు చేసి చూపించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి తెలంగాణ ఏమి చేశారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ ఛైర్మన్ లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.