ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Minister Buggana Rajendranath ) అన్నారు.విభజన హామీలు, రాష్ట్ర అవసరాల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు.
ఈ క్రమంలోనే టీడీపీపై మండిపడిన మంత్రి బుగ్గన వైసీపీ మినహా అన్ని పార్టీలతోనూ టీడీపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు.మరోవైపు జనసేన సిద్ధాంతం ఏంటో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
అయితే దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలు, పేదల సంక్షేమమే తమ విధానమని స్పష్టం చేశారు.