చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.తనకు ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవమని చెప్పారు.

 Minister Botsa's Counter To Chandrababu's Comments-TeluguStop.com

రాష్ట్రంలో వర్షాలు పడాలన్నా.అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు రాకూడదని తెలిపారు.

దేవుడి దయతో గతంలో చంద్రబాబుకు సీఎం పదవి వచ్చిందన్నారు.తనను అవమానించారని చంద్రబాబే అనుకుంటున్నారని పేర్కొన్నారు.

కానీ ఆయనను ఎవరూ అవమానించలేదని వెల్లడించారు.చంద్రబాబు సానుభూతి కోసమే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అనంతరం చంద్రబాబు ఏం మాట్లాడినా తమకు ఆశీస్సులేనన్నారు.ప్రజలే తమకు న్యాయనిర్ణేతలన్న మంత్రి బొత్స.

చంద్రబాబు కాదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube