కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు.ఈయనకు తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా.
రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.తమిళ్ లో ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ బైలింగ్వన్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.మరి చివరి సమయానికి ఈ సినిమా బరిలో నిలుస్తుందో లేదంటే మళ్ళీ వాయిదా పడుతుందో వేచి చూడాల్సిందే.అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే విజయ్ నెక్స్ట్ సినిమాపై మరింత ఆసక్తి పెడుతున్నారు ఫ్యాన్స్.
ఎందుకంటే ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవలే ‘విక్రమ్’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఎవరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లోకేష్ విజయ్ దళపతి తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాలేదు కానీ ఈ సినిమా బిజినెస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.
విజయ్ కెరీర్ లో 67వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ట్ కాకుండానే అంచనాలు ఏర్పడ్డాయి.మరి తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు రికార్డు ధర చెల్లించి మరీ సొంతం చేసుకున్నారు అని ఊహాగానాలు మొదలయ్యాయి.
అది కూడా 100 కోట్లకు పైగానే అని కోలీవుడ్ మీడియా చెబుతున్న మాట.ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే బిజినెస్ భారీగా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.మరి సెట్స్ మీదకు వెళితే ఇంకెంత ప్రచారం చేస్తారో చూడాలి.







