సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పైకి నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల వెనుక ఎన్నో బాధలు అనారోగ్య కారణాలు దాగి ఉంటాయి.సెలబ్రిటీలకు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారు అవన్నీ పట్టించుకోకుండా పైకి మాత్రం నవ్వుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు.
ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎంతమంది బుల్లితెర వెండి ధర సెలబ్రిటీలు క్యాన్సర్ బారినపడి ఏళ్ల తరబడి పోరాడిన విషయం తెలిసిందే.ఇందులో కొందరు మాత్రమే అనారోగ్యాల కారణంగా మరణించగా మరికొందరు ధైర్యంగా వాటిని ఎదుర్కొని ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే నటి కూడా క్యాన్సర్ను పోరాడి జయించింది అని సంతోషపడేలోపే మరొకసారి ఆమె అనారోగ్య బారిన పడింది.పూర్తి వివరాల్లోకి వెళితే.ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ తాజాగా గుండెపోటుకు గురైంది.దీంతో ఆమెను కోల్‌కతా లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా ప్రస్తుతం వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.కాగా నవంబర్ ఒకటవ తేదీని ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవ్వడంతో ఆమెకు వైద్యులు సర్జరీ చేశారు.
అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తాజాగా సిటీ స్కాన్‌లో ఆమె మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారుగుర్తించారు.అలాగే ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.మందుల ద్వారా నయం చేసేందుకు ప్రయత్నిస్తామనని, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేము అని అన్నారు వైద్యులు.
కాగా నటి ఐంద్రీలా శర్మ వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు ఓటిటి ప్రాజెక్ట్ తో బిజీబిజీగా మారింది.అయితే ఇప్పటికే రెండుసార్లు క్యాన్సర్ మహమ్మారి బారి నుంచి పోరాడి గెలిచిన ఆమె మరోసారి గుండెపోటుకు గురైంది.
కాగా తాజాగా మరోసారి ఆమె అనారోగ్యానికి గురి కావడంతో తన కోసం ప్రార్థించమని ఐంద్రీలా ప్రియుడు, నటుడు సవ్యసాచి చౌదరి అభిమానులను కోరాడు.