అంతరిక్షంలో భూమి పైకి ఉల్కలు దూసుకురావడం ఇది కొత్తేమి కాదు.చాలా ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి చివర్లో వేరే దిశగా వెళ్లిపోతున్నాయి.
తాజాగా ఒక ఉల్క భూమికి చేరువగా వస్తుంది.అయితే ఈ ఉల్క గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి చుట్టూ కొన్ని నెలలు తిరుగుతుందని, నవంబరు 2020లో భూమికి “మినీ మూన్” గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నాసా శాస్త్రవేత్తలు “మినీ మూన్” గా పిలువబడుతున్న “కాస్మిక్ ఆబ్జెక్ట్” భూమి గురుత్వాకర్షణ వల్ల భూమి దగ్గరికి వస్తుందని, అది 1960లో చంద్రుడిపై ప్రయోగించి ఫెయిల్ అయిన మూన్ లాండింగ్ మిషన్ రాకెట్ లోని జంక్ వస్తువులు అయి ఉంటాయి అని అంటున్నారు.
దాదాపు 50 ఏళ్ల తరువాత అది తిరిగి ఇంటికి వస్తుందని “పాల్ చోడస్” అనే శాస్త్రవేత్త మీడియా తో మాట్లాడారు.
మొదట దీనిని హవాయిలో కనుగొన్నారు.ఇది సుమారు 26 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు.అన్ని ఉల్కల లాగా ఇది కూడా 2400 km ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు.నేను చెప్పేది తప్పు కూడా అయ్యి ఉండొచ్చు అని కూడా ఆయన అన్నారు.
ఈ హలోవీన్ కు 76 ఏళ్ల తరువాత బ్లూ మూన్ కనిపించబోతుంది.