సాధారణంగా మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు, లేదా నొప్పి కలిగినప్పుడు మన కళ్ళలో నుంచి కన్నీరు కారుతాయి.మనసు ఎంత పెద్ద గాయం అయినా కానీ కన్నీరే కారుతాయి.
కానీ కళ్ళల్లో కన్నీరు బదులుగా రక్తం కారడం ఎప్పుడైనా విన్నారా? లేక చూశారా?వినడానికి చాలా వింతగా అనిపించినా ఇది నిజం.పులివెందులలో ఓ బాలిక కంటి నుంచి రక్తం కారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
డాక్టర్లకే అంతుచిక్కని వ్యాధి గా మారిపోయింది.
పులివెందులలో పాలక్షి అనే అమ్మాయి 8వ తరగతి చదువుతోంది.
ఉన్నట్టుండి సడన్ గా గత 15 రోజుల క్రితం నుంచి ఆమె కళ్ళు కన్నీరు కు బదులుగా రక్తం రావడం అందరినీ భయాందోళనకు గురి చేసింది.కళ్ళ నుంచి రక్తం కళ్ళు బాగా నొప్పి చేస్తున్నాయని పాలాక్షి తెలిపింది.
రోజుకో నాలుగు నుంచి ఐదు సార్లు వరకు కళ్ళ నుంచి రక్తం కారుతుంది అని ఆమె తెలిపారు.చికిత్స నిమిత్తం అనంతపురం, కడప, పులివెందుల తదితర ఆసుపత్రిలో చూపించగా ఎటువంటి ఫలితం లేకపోయింది.
ఆమె కళ్ళ నుంచి రక్తం ఆగడం లేదు.ఏ సమస్య వల్ల కళ్ళ నుంచి రక్తం కారుతుంది డాక్టర్లకే అంతుచిక్కని విషయంగా మారింది.
సాధారణంగా మన శరీరంలో వేడి చేసినప్పుడు ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం మనం చూస్తూ ఉంటాం కానీ కళ్ల నుంచి రక్తం కారడం ఇది ఒక అంతుచిక్కని సమస్యగా మారిందని డాక్టర్లు సూచిస్తున్నారు.పులివెందల లోని ఒక డాక్టర్ తమిళనాడులోని వేలూరు లో సిఎంసి కి వెళ్ళమని సూచించారు.
అయితే అక్కడకు చికిత్స నిమిత్తం వెళితే దాదాపుగా రెండు, మూడు లక్షలు దాకా ఖర్చు అవుతుందని బాధిత తల్లిదండ్రులు అయితే అంతా డబ్బులు చెల్లించి చికిత్స చేసుకునే అంత స్తోమత లేక చిన్నారి ఈ సమస్యతో అధికంగా బాధపడుతుంది.దాతలు ఎవరైనా దయతలచి సహాయం చేస్తే చిన్నారికి కంటి సమస్య నయమవుతుందని పాలక్షీ తల్లిదండ్రులు దాతల సహాయార్థం ఎదురుచూస్తున్నారు.