టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి వలసలు?

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుండి రాబోయే బడ్జెట్‌ సమావేశాల తర్వాత భారీగా కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ జోష్యం చెబుతున్నాడు.

ఇప్పటి వరకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి పోయిన నాయకులు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం ఖాయం అని, మరియు ఇతర తెరాస నాయకులు కూడా కాంగ్రెస్‌ బాట పట్టబోతున్నారంటూ షబ్బీర్‌ అలీ చెప్పుకొచ్చాడు.

అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలే కారణం అని కూడా ఈయన చెప్పుకొచ్చాడు.కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి మయం అయ్యిందని, డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేస్తానన్నా కూడా ఎందుకు బర్తరఫ్‌ చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఈయన డిమాండ్‌ చేశాడు.

అన్ని శాఖల్లో కూడా అవినీతి జరుగుతుంటే కేవలం ఒక్క మంత్రిని మాత్రమే కేసీఆర్‌ తప్పించి చేతులు దులుపుకున్నారన్నారు.ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అవినీతి హెల్త్‌లైన్‌కు భారీ సంఖ్యలో కాల్స్‌ వస్తున్నా కూడా వాటిని పరిస్కరించేందుకు ముఖ్యమంత్రి ఎందుకు రంగంలోకి దిగలేదని అలీ ప్రశ్నించాడు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు
Advertisement

తాజా వార్తలు