అర్ధరాత్రి రైలు భోగిలో మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా:పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.

దీంతో పార్శిల్‌ బోగీలో ఉన్న సరుకు అంతా దగ్ధమయింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.కాగా,పార్శిల్‌ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News