ఐపీఎల్ అయినా.. డబ్ల్యూపీఎల్ అయినా ముంబై ఇండియన్స్ తగ్గేదేలే.. అంబానీ టీమా మజాకా..!

ఐపీఎల్ లోనే కాదు డబ్ల్యూపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఐపీఎల్ లో ఐదు టైటిల్ గెలిచిన ముంబై.

 Mi Only Team To Fastest Run Chase And Biggest Win In Wpl And Ipl Details, Mi ,f-TeluguStop.com

డబ్ల్యూపీఎల్ లో కూడా అద్భుత ఆటను ప్రదర్శిస్తూ జరిగిన రెండు మ్యాచ్లలో ఘన విజయం సాధించింది.శనివారం జరిగిన గుజరాత్ జెయింట్స్ – ముంబై ఇండియాన్స్ తొలి మ్యాచ్లో 143 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ తొలి విజయం అందుకుంది.

ఇక సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోనూ ప్రత్యర్థి జట్టులకు గట్టి పోటీ ఇస్తూ చిత్తుగా ఓడించ సాగింది.తాజాగా ముంబై ఇండియన్స్ ఖాతాలో ఒక రికార్డు పడింది.ఐపీఎల్, డబ్ల్యూపీయల్ లలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా.

వేగంగా లక్ష్యాన్ని చేదించిన జట్టుగా ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.ఐపీఎల్ లో పురుషుల ముంబై జట్టు 146 పరుగుల తేడాతో విజయం సాధించి ఒక రికార్డు, 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి మరొక రికార్డు సాధిస్తే.డబ్ల్యూపీఎల్ లో మహిళల ముంబై జట్టు 143 పరుగుల తేడాతో విజయం సాధించి ఒక రికార్డు,

14.2 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించి మరొక రికార్డు సొంతం చేసుకుంది.ఇండియన్స్ మహిళల జట్టులో వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మ్యాథ్యూస్ బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోనూ ముంబై జట్టుకు కీలకంగా మారింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో 77 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.మరొకవైపు బౌలింగ్ లోను కీలకమైన మూడు వికెట్లను తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ను వేలంలో 40 లక్షలకు ముంబై జట్టు కొనుగోలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube