బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈనెల 9న నామినేషన్లను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా గవర్నర్ కోటా అభ్యర్థులను కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ ప్రకటించనున్నారు.







