తెలంగాణలో వచ్చే ఎన్నికలతో సత్తా ఛటలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఎందుకంటే రాష్ట్రంలో హస్తం పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య విభేదాలతో కాంగ్రెస్ తరచూ చర్చల్లో నిలుస్తోంది.దీంతో మెల్లగా పార్టీ బలం కోల్పోతు వస్తోంది.
గతంలో తెలంగాణలో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడవ స్థానానికి పడిపోయింది.దీంతో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని హస్తం హైకమాండ్ గట్టిగా ప్రయత్నిస్తుంది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర చేపట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నారు.అయితే పార్టీకి పూర్వవైభవం తీసుకోచేందుకు ఈమాత్రం సరిపోదు.
అందుకే హస్తం నేతలు కొత్త వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తోంది కాంగ్రెస్ పార్టీ.ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతగా ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని చరిష్మాను సొంతం చేసుకున్నారు.రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి కాంగ్రెస్ కు తిరుగులేని ప్రజాధరణను కట్టబెట్టారు.
దాంతో కాంగ్రెస్ నేతగా వైఎస్ఆర్ చేసిన మంచి పనులు.ముఖ్యమంత్రి పదవిలో ఆయన చేసిన మంచి పనులన్నీ కాంగ్రెస్ కు చెందినవేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే వైఎస్ఆర్ పాలన మళ్ళీ వచ్చినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చెబుతున్నారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జపం చేస్తుండడంతో వైఎస్ షర్మిల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది.ఎందుకంటే వైఎస్ఆర్ కూతురిగా రాజన్న పాలన అందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల.ఇప్పటికే తన పాదయాత్రతో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళుతూ.అడుగడుగున వైఎస్ఆర్ పేరును గుర్తు చేస్తూ ప్రజామద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ మంత్రం వల్లిస్తుండడంతో వైఎస్ఆర్ సానుభూతిపరుల ఓటు బ్యాంకు ఎటువైపు మల్లుతుందనేది ఆసక్తికరంగా మారింది.ఒకవైపు వైఎస్ఆర్ కూతురు షర్మిల మరోవైపు వైఎస్ఆర్ ఉన్న కాంగ్రెస్ ఇలా రెండు పార్టీలు ఇప్పుడు వైఎస్ఆర్ జపం చేస్తుండడం ఆసక్తికర అంశమే.
మరి ఇరు పార్టీలు కూడా వల్లిస్తున్న వైఎస్ఆర్ మంత్రం.ఆ రెండు పార్టీలకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.







