పుచ్చకాయ పంటను ఎర్ర నల్లి పురుగుల బెడద నుండి సంరక్షించే పద్ధతులు..!

పుచ్చకాయ పంటను( Watermelon crop ) వేసవికి అనువైన పంటగా చెప్పవచ్చు.అయితే ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఏడాదిలో ఏ కాలంలో అయినా పుచ్చకాయ సాగు చేయవచ్చు.

 Methods To Protect The Watermelon Crop From Red Black Worms, Watermelon Crop, Re-TeluguStop.com

అయితే మంచి లాభాలు పొందాలంటే.ఒకేసారి కాకుండా విడతల వారీగా నాటుకొని సాగు చేయాలి.

పుచ్చకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు( Red soils, black soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 6-7 మధ్య ఉంటే పంటకు చాలా అనుకూలం.

ఒక ఎకరం పొలంలో 8 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను( phosphate fertilizers ) ఆఖరి దుక్కిలో వేసి పొలాన్ని కలియదున్నాలి.పుచ్చకాయ పంటను ఎత్తుబెడ్ల పద్ధతిలో సాగు చేయాలి.

విత్తనం విత్తేటప్పుడు జిగ్ జాక్ పద్ధతి అనుసరించి విత్తుకోవాలి.ఇక మొక్కల మధ్య 75 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

Telugu Black Soils, Borax, Methodsprotect, Murate Potash, Red Black Worms, Red S

పుచ్చకాయ మొక్క వయసు 25 రోజులు దాటాక ఒక ఎకరాకు 30 కిలోల యూరియా( Urea ) వేసుకోవాలి.మొక్క వయసు 55 రోజులు దాటాక ఒక ఎకరాకు 15 కిలోల యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్( Murate of Potash ) ఎరువులను వేసుకోవాలి.పుచ్చకాయ మొక్కకి మూడు లేదా నాలుగు ఆకులు ఉన్నప్పుడు ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల బోరాక్స్ ( Borax )పిచికారి చేయాలి.పుచ్చకాయ మొక్క ఒక మీటరు పొడవు పెరిగిన తర్వాత మొక్క యొక్క చివర్లను తుంచి వేస్తే పక్క కొమ్మలు చిగురించి, మొక్క గుబురుగా తయారై అధిక దిగుబడి పొందవచ్చు.

Telugu Black Soils, Borax, Methodsprotect, Murate Potash, Red Black Worms, Red S

పుచ్చకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే ఎర్ర నల్లి పురుగులు కీలకపాత్ర పోషిస్తాయి.పొడి వాతావరణంలో ఈ పురుగులు పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి.అయితే పొలంలో ఈ పురుగులను గుర్తించడం చాలా కష్టం.ఎందుకంటే ఈ పురుగులు ఆకు యొక్క అడుగు బాగానే చేరి రసాన్ని పిలుస్తాయి.కాబట్టి పంటని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఈ పురుగుల ఉనికి కనిపెట్టి ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీ లీటర్ల స్పెరోమేసిఫిన్ ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube