వంగ పంటలో లేస్ పురుగులను అరికట్టే పద్ధతులు..!

వంకాయ కూరగాయ పంటలలో ఒకటి.మార్కెట్లో వంకాయ( eggplant ) కు ఏడాది పొడవున మంచి డిమాండ్ ఉంటుంది.

కాకపోతే ఈ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.చీడపీడలు ఆశించిన వంకాయలకు మార్కెట్లో ధర ఉండదు.

కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ సకాలంలో సంరక్షక చర్యలు చేపడుతూ సాగు చేయాలి.వంకాయలకు లెస్ పురుగుల బెడద చాలా ఎక్కువ.

ఈ పురుగులు లేత గోధుమ రంగు, తెలుపు రంగులలో ఉంటాయి.ఈ పురుగులు దాదాపుగా నాలుగు మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

Advertisement

ఇతర మొక్కల అవశేషాలపై జీవిస్తూ అనుకూల వాతావరణ పరిస్థితుల కోసం ఎదురుచూసి వంకాయ చెట్లపై గుడ్లు పెడతాయి.

ఈ పురుగులు గుంపులుగా చేరి మొక్కల ఆకుల కింది భాగాన సావాసాలు ఏర్పరచుకొని ఆకుల కణజాలాన్ని( Leaf tissue ) ఆహారంగా తీసుకుంటాయి.ఆకులు పసుపు రంగులోకి మారి ముడతలు పడతాయి.ఆ తర్వాత క్రమంగా మొక్క చనిపోతుంది.

వంగ కాయలు సరిగ్గా వృద్ధి చెందవు.పొలంలో ఈ పురుగులను గుర్తించిన తర్వాత ఆ మొక్క ఆకులు లేదంటే మొక్కనే పీకేసి కాల్చి నాశనం చేయాలి.

ఈ పురుగుల ఉనికి కోసం పొలంలో తరచూ గమనిస్తూ ఉండాలి.మొక్కల మధ్య అధిక దూరం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని, పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీస్తూ ఉండాలి.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
సింహంపై ఎదురుదాడి చేసిన అడవి దున్న.. వైరల్ వీడియో

సేంద్రియ పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే పైరిత్రిన్స్, వేప నూనెను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే మలాథియాన్ లేదా పెరిథ్రోయిడ్ ను మొక్క ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టవచ్చు.

Advertisement

తాజా వార్తలు