టమాటా పంట( Tomato crop )కు మార్కెట్లో ఎప్పుడు ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పలేం కానీ కొన్ని సమయాలలో టమాటా ధర ఊహించని విధంగా భారీ ధర పలుకుతోంది.అయితే టమాటా పంట సాగు చేసే విధానంపై పూర్తి అవగాహన ఉంటే పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.
టమాటా పంటను ఏఏ చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తాయి.వాటిని సకాలంలో ఎలా గుర్తించి ఎలా నివారించాలి అనే దానిపై అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగు చేపట్టాలి.

టమాటా పంట సాగుకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో బ్యాక్టీరియల్ గజ్జి తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.బ్యాక్టీరియా విత్తనాలు లేదా భూమి లోపల ఉండే ఇతర పంట అవశేషాలలో జీవించి ఉండి, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలకు వ్యాపిస్తుంది.భూమిలో అధిక తేమా లేదంటే అధిక ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగులు వృద్ధి చెందుతుంది.ఈ తెగులు సోకిన మొక్కలలో ఎదుగుదల తగ్గుతుంది.మొక్కలపై తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా కణజాలాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి.మొక్కల ఆకులపై, టమాటా పండ్లపై వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
పంట దిగుబడి తగ్గి, పంట నాణ్యత కూడా తగ్గుతుంది.

ఒక్క టమాట పంట మాత్రమే కాదు ఏ పంటను సాగు చేసినా తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.ఆరోగ్యవంతమైన నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి.బ్యాక్టీరియా చనిపోవాలంటే నారుమడి మరియు పొలం ఆవిరితో శుద్ధి చేయాలి.
పొలంలో తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే వెంటనే పీకి కాల్చి నాశనం చేయాలి.ముఖ్యంగా వేసవి కాలంలో పొలాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలి.
ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగించాలి.ఈ తెగులు రాకుండా ఉండాలంటే.
ముందుగా విత్తనాలను 5% హైడ్రోక్లోరిక్ యాసిడ్( Hydrochloric acid ) లో నానబెట్టాలి.తెగులు సోకిన తర్వాత నివారణ కోసం రసాయన పిచికారీ మందులైన కోకో-50, బిల్కోప్-50 లలో ఏదో ఒక దానిని మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.