బీట్ రూట్ పంటను( Beet Root Crop ) శీతాకాలపు పంటగా చెప్పుకోవచ్చు.ఈ పంట సాగుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే నెలలు చాలావరకు అనుకూలంగానే ఉంటాయి.
సారవంతమైన నేలలు, లోతైన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం.ఈ పంటను ఆగస్టు నెల మొదటి వారం నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకునేందుకు అనుకూలమైన సమయం.
ఒకేసారి అధిక విస్తీర్ణంలో విత్తకుండా దఫా దఫాలుగా ఎత్తుకుంటే మార్కెట్ డిమాండ్ ను అనుకూలంగా పంటను పొందవచ్చు.
బీట్ రూట్ లో అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకం విత్తనాల విషయానికి వస్తే.ఎర్లీ వండర్ రకం పంట కాలం 55 నుంచి 60 రోజులు.క్రీమ్సన్ గ్లోబ్ రకం పంట కాలం మూడు నెలలు.
డెట్రాయిట్ డార్క్ రెడ్ రకం పంట కాలం 80 నుంచి 100 రోజులు.వీటిలో ఏ రకాన్ని సాగు చేసిన మంచి దిగుబడి పొందవచ్చు.
వేసవికాలంలో ( Summer ) నేలను లోతు దుక్కులు దున్నుకున్నాక, ఇతర పంట అవశేషాలను పూర్తిగా తొలగించాలి.ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో( Cattle Manure ) పాటు 15 కిలోల పోటాష్, 15 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం ఎరువులు వేసుకోవాలి.
పంటకు డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తే బీట్ రూట్ గడ్డ బాగా ఊరడంతో పాటు దాదాపుగా కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.పైగా నీరు వృధా అవ్వదు.విత్తనం మొలకెత్తిన 25 రోజుల తర్వాత కలుపు తీసి, మొక్క మొదల్లకు మట్టిని ఎగదోయాలి.ఈ పంటకు బూజు తెగుళ్ల బెడద( Powdery Mildew ) కాస్త ఎక్కువ.
ఈ తెగుళ్లను సకాలంలో నివారించకపోతే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల డైథేన్జెడ్-78 ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
పంటను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉంటే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 12 టన్నుల దిగుబడి పొందవచ్చు.