బెరడు తొలిచే పురుగుల నుండి ఉద్యానవన పంటలను సంరక్షించే పద్ధతులు..!

ఉద్యానవన పంటలైన మామిడి, జామ, చీని, కోకో, దానిమ్మ( Pomegranate ), మునగ లాంటి పంటలకు బెరడు తొలిచే పురుగుల బెడద చాలా ఎక్కువ.

ఈ పురుగులను సకాలంలో గుర్తించి నివారించకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

కాబట్టి ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు( Farmer ) పూర్తి అవగాహనతో సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

ఈ బెరుడు తొలిచే తల్లి పురుగులు మే, జూలై నెలలలో కొశద్ధ దశ నుండి బయటకు వచ్చి చెట్టు బెరడు వదులుగా ఉండే ప్రదేశాల్లో గుడ్లు పెడతాయి.తరువాత పది రోజుల వ్యవధిలో గుడ్లు పొదిగి గోధుమ రంగులో గంగోలి పురుగులు బయటకు వస్తాయి.ఈ పురుగులు బెరడును తిని కాండం లోపలికి తొలిచుకుపోతాయి.

పగలంతా కాండంలో ఉంటూ రాత్రి సమయాలలో ఈ పురుగులు విసర్జించిన పదార్థం ద్వారా తయారైన గొట్టం నుంచి బయటకు వచ్చి బెరడును తింటాయి.ఈ పురుగులు సుమారు 10 నెలల వరకు కాండం లోపలే ఉంటూ బెరడును ఆశించడం వల్ల పూత, పిందెలు సరిగా ఏర్పడవు.

Advertisement

అంతేకాకుండా లేత ఆకులపై దాడి చేసి పూర్తిగా తినేస్తాయి.ఈ పురుగులు చిన్న చెట్ల మీద కంటే పెద్ద చెట్లపై అధికంగా దాడి చేస్తాయి.కాబట్టి ఈ పురుగులను సకాలంలో గుర్తించి నివారించాలి.Farmer

ఈ బెరడు తొలిచే పురుగులను నివారించాలంటే ముందుగా.చెట్ల యొక్క బెరడును, కొమ్మలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈ పురుగులు ఆశించిన బెరడును, కొమ్మలను తొలగించి కాల్చివేయాలి.చెట్టు రంద్రాలలో ఈ పురుగుల ఉనికిని గుర్తించి ఇనుప చువ్వలతో పొడిచి చంపేయాలి.

లేదంటే చెట్టు రంద్రాలలో పెట్రోల్ లో లేదంటే కిరోసిన్( Kerosene ) లో ముంచిన దూదిని పెట్టాలి.ఆ తరువాత ఆ రంద్రాన్ని బురదతో పూడ్చాలి.లేదంటే రంధ్రంలో 0.5 డైక్లోరోవాస్ ను లీటర్ నీటిలో కలిపి సహాయంతో నింపాలి.ఈ సస్యరక్షక పద్ధతులు పాటిస్తే ఈ చీడపీడల బెడద అరికట్టవచ్చు.

హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనా..ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలివే!
Advertisement

తాజా వార్తలు