టీ దోమల నుండి జీడిమామిడిని సంరక్షించే పద్ధతులు..!

వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్య చీడపీడల బెడద.అయితే కొన్ని రకాల చీడపీడలతో పంటలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

జీడి మామిడి ( jeedi mango )పంట సాగులో టీ దోమల వల్ల తీవ్ర నష్టం ఎదుర్కోవలసి వస్తుంది.హెలోపెల్టిస్ ఆంటోనీ( Helopeltis Antony ) జాతికి చెందిన టీ దోమలు ఒకసారి పంటను ఆశిస్తే 80% పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాకుండా బొట్రియోడిప్లోడియా థియోబ్రోమే శిలీంధ్రాలు వల్ల కొమ్మలు పూర్తిగా ఎండిపోవడం జరగడం వెనక టీ దోమల పాత్ర ఉంటుంది.జీడి మామిడి పూత దశలో, కాయ దశలో ఉన్నప్పుడు వేప నుండి జీడి మామిడికు టీ దోమలు( Tea mosquitoes ) వ్యాప్తి చెందుతాయి.

ఇవి లేత కొమ్మలు, ఏత ఆకులు, పిందెలలోని రసాన్ని పీల్చడంతో ఎర్రని జిగురు బిందువులు పడి లేత కొమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.ఈ పురుగులు రసం పీల్చే సమయంలో విషయాన్ని విడుదల చేయడంతో కొమ్మలకు నల్లని మచ్చలు ఏర్పడి ఈ చివరకు ఎండిపోతాయి.

Advertisement

ఇక పిందెలు మాడిపోవడం, కాయలు ముడుచుకొని పోవడం, కొన్ని కాయలపై గజ్జి మచ్చలు ఏర్పడతాయి.

జీడి మామిడి సాగు వేశాక అక్టోబర్, నవంబర్ నెలలలో ఆశించి మే నెల వరకు పంటను నాశనం చేసే పనిలో ఉంటాయి.కాబట్టి ఈ సమయంలో వేప, జీడి మామిడి చెట్లపై నిఘా పెట్టాలి.లేత చిగుర్లు వచ్చే సమయంలో, పూత వచ్చే సమయంలో, కాయలు వచ్చే సమయంలో వీటి ఉనికిని గుర్తించాలి.మొదటిసారి ఒక లీటరు నీటిలో 0.6 మిల్లీమీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను మొక్క మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.ఒక వారం రోజుల తర్వాత మళ్లీ ఒక లీటర్ నీటిలో 2.0 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ తో పిచికారి చేయాలి.మూడవ వారంలో ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్ల ప్రోఫెనోఫాస్ కలిపి పిచికారి చేయాలి.టీ దోమల ఉధృతి కాస్త ఎక్కువగా ఉంటే మూడు వారాల లోపు మూడుసార్లు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు