మెర్సిడెస్-బెంజ్ నుంచి కొత్త లగ్జరీ వెహికల్ లాంచ్.. ఆఫ్-రోడ్డు డ్రైవ్స్‌కి బెస్ట్!!

మెర్సిడెస్ బెంజ్( Mercedes Benz ) భారతదేశంలో దాని G-క్లాస్ SUV అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.మునుపటి G 350d మోడల్‌ను మరింత శక్తివంతమైన, స్టైలిష్ G 400dతో కంపెనీ భర్తీ చేసింది.దీనిని రూ.2.55 కోట్ల ధర (ఎక్స్‌షోరూమ్‌)తో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది.ఈ G 400d కారు అడ్వాన్స్డ్‌ ఫీచర్లతో మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

 Mercedes-benz G 400d Launched In India Details, Mercedes-benz, G-class Suv,  G 4-TeluguStop.com

కస్టమర్లు ఇప్పుడు వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.డెలివరీలు ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతాయి.

జీ 400d 330hp, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది ప్రీవియస్ మోడల్ పోలిస్తే పవర్‌లో ఇది గణనీయమైన పెరుగుదలను అందిస్తుంది.ఇది కేవలం 6.4 సెకన్లలో 0 నుంచి 100kph వరకు స్పీడ్ అందుకోగలదు, ఇది మునుపటి కంటే ఒక సెకను వేగంగా గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది.ఈ ఎస్‌యూవీలోని( G 400d SUV ) బలమైన నిచ్చెన-ఫ్రేమ్ నిర్మాణం, G-మోడ్ అనేవి ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కు బెస్ట్ గా నిలుస్తాయి.ఇది 241మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 700మిమీ వరకు నీటిలో ప్రయాణించగల సామర్థ్యంతో వస్తుంది.

Mercedes-Benz భారతదేశంలో G 400d రెండు వేరియంట్లను అందిస్తోంది.అవే అడ్వెంచర్ ఎడిషన్, AMG లైన్. భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అడ్వెంచర్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన ఎక్స్‌టర్నల్ పెయింట్ ఆప్షన్స్, 18-అంగుళాల రూఫ్ రాక్, స్పేర్-వీల్ హోల్డర్, రిమూవబుల్ లాడర్ ఉన్నాయి.AMG లైన్ వేరియంట్ AMG స్టైలింగ్ క్యూస్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లైడింగ్ సన్‌రూఫ్, ప్రీమియం బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది.

భారతీయ మార్కెట్లో, ఈ కొత్త మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాహనాలతో పోటీపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube