హోరాహోరీగా తలపడిన మగపులులు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!

ఆడతోడు లేనిదే మగవారి జీవితం సార్థకం కాదని పెద్దలు చెబుతుంటారు.ఆజన్మ బ్రహ్మచారులుగా ఉన్న వారు సైతం పెళ్లి చేసుకోవాలని ఇతరులకు సూచిస్తుంటారు.

 Men Tigers Who Fought Horribly , Tigers , Fight , Viral News , Social Media ,-TeluguStop.com

ఇక ప్రియురాలు లేదా భార్య కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారు.ఇటీవలే తన భార్య మీద జోక్ చేశాడని హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఏకంగా వ్యాఖ్యాత చెంప చెళ్లుమనిపించాడు.

ఇదేమీ పెద్ద విషయం కాదని, ఆడ వారి కోసం ఏకంగా సామ్రాజ్యాలే కూలిపోయిన ఘటనలు చరిత్రలో ఉంటాయని కొందరు గుర్తు చేస్తున్నారు.ఇది మనుషులలోనే కాకుండా జంతువులలో కూడా కనిపిస్తుంటుంది.

తాజాగా ఓ ఆడపులి కోసం రెండు మగపులులు అడవిలో హోరాహోరీగా తలపడ్డాయి.ఆ వీడియో చూసిన వారికి ఒళ్లు జలదరిస్తోంది.

దాని గురించి తెలుసుకుందాం.

ఇటీవల కొందరు అడవిలో జంతువులను నేరుగా చూసేందుకు వైల్డ్ లైఫ్ సఫారీ టూర్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో రెండు పులులు తమ వాహనానికి దగ్గరగా రోడ్డు దాటుతున్నాయి.దీంతో వారు తమ వాహనం ఆపేసి, వాటిని వీడియో తీయడం ప్రారంభించారు.ఇంతలో రోడ్డుకు అవతల ఓ ఆడపులి ఉంది.దానిని చూసిన ఈ రెండు మగపులులు ఒక్కసారిగా ఒకదానిపై మరొకటి భీకరంగా తలపడ్డాయి.

తమ తమ బలం మేర పంజా విసురుతూ దాడులు చేసుకున్నాయి.అవి అలా ఒకదానిపై మరొకటి విరుచుకుపడడం చూసి పర్యాటకులు ఒకింత ఆందోళన చెందారు.

చివరికి ఓ పులి అలసిపోయి తన పోరాటం విరమించుకుంది.దీంతో ఈ భీకర పోరు ఆగిపోయింది.

ఇదంతా తన వల్లే అని తెలిసిన ఆడపులి ఓ పక్కగా నిలబడి వీటి పోరాటం అలా చూస్తూ ఉండిపోయింది.ఇది నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ఈ పులుల పోరాటాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.ఈ పురుల భీకర పోరు గగుర్పాటుకు గురి చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube