భోళా టీజర్ చూసి మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్( Bhola Shankar ).

చిరంజీవి వరుసగా రెండు హిట్స్ అందుకున్న తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు భారీగానే పెరిగాయి.

ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బోణీ కొట్టిన చిరు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.తమిళ్ వేదాళం సినిమాకు( Vedalam movie ) రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

ఇప్పటికే టీజర్, రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేయగా రెండు కూడా చార్ట్ బస్టర్ కాగా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఈ సినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ జామ్ జామ్ జజ్జనక( Jam Jam Jajjanaka ) సాంగ్ లాంచ్ లో మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ సాంగ్ రిలీజ్ తర్వాత ఈయన మాట్లాడుతూ.భోళా శంకర్ టీజర్ రిలీజ్ అయ్యాక మహేష్ బాబు గారు నాకు ఫోన్ చేసి అద్భుతంగా ఉందని చెప్పారని.మహతి స్వర సాగర్ అందించిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగా నచ్చింది అని చెప్పారు అని.చిరంజీవి, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉందని ఈ ఇద్దరు ఎప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటారు అని ఈయన చెప్పుకొచ్చాడు.ఈ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Advertisement

ఈ సినిమాలో చిరంజీవికి( Chiranjeevi ) జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.

Advertisement

తాజా వార్తలు