తాగుతూ బాధలు పంచుకుంటున్న మెహబూబ్ దిల్ సే.. అలా చేయకండంటూ రిక్వెస్ట్?

సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల సెలబ్రెటీలు ప్రతి ఒక్క విషయాన్ని బాగా పంచుకుంటున్నారు.తాము ఏ పని చేసిన వెంటనే పంచుకుంటున్నారు.

 Mehboob Dil Say Is Sharing His Sufferings While Drinking Request Not To Do That-TeluguStop.com

పైగా ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రకరకాల ఫోటోలను, ఫన్నీ వీడియోలను పంచుకుంటూ సందడి చేస్తూ ఉన్నారు.ఇక తమకు ఏ బాధ వచ్చినా కూడా వెంటనే ఫాలోవర్స్ తో బాధలు చెప్పుకుంటున్నారు.

అయితే తాజాగా మెహబూబ్ దిల్సే కూడా తన బాధను పంచుకుంటూ ఒక వీడియోను పంచుకున్నాడు.ఇంతకు అసలు విషయం ఏంటో చూద్దాం.

తెలుగు ప్రేక్షకులకు మెహబూబ్ దిల్ సే గురించి బాగా పరిచయమని చెప్పాలి.రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్  4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందులో తన ప్రవర్తనతో అందరిని అభిమానులుగా మార్చుకున్నాడు.

ఈయన మొదట యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఉండేవాడు.ఇప్పటికీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి సోషల్ మీడియా ప్రియులను బాగా ఆకట్టుకున్నాడు.

అలా తన నటనకు ఎంతోమంది సోషల్ మీడియా ప్రేక్షకులు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు.ముఖ్యంగా తన డాన్స్ మాత్రం బాగా హైలైట్ అని చెప్పవచ్చు.

తన డాన్స్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మెహబూబ్.నిజానికి ఈయన డాన్స్ స్టెప్ లు చూస్తే మతి పోవాల్సిందే.

ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు మెహబూబ్.తన డాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తుంటాడు.తన ఫ్రెండ్స్ తో కలిసి తిరిగిన వీడియోలను బాగా పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటాడు.ఇక ఈయనకు ఇన్స్టా లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈయన బుల్లితెరపై పలు షోలల్లో కనిపించాడు.అయితే ప్రస్తుతం స్టార్ మా లో బిబి డాన్స్ జోడి ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో మెహబూబ్ తన డాన్స్ స్టెప్ లతో బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఫిదా చేస్తున్నాడు.మొదట్లో ఈయనతో అషు రెడ్డి జోడిగా ఉండగా.

ప్రస్తుతం శ్రీ సత్య జోడిగా ఉంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగాతన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకున్నాడు.

అందులో తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించాడు.

బాదం మిల్క్ తాగుతూ మందు తాగే వారిలా ప్రవర్తించారు.ఇక ఆ వీడియో షేర్ చేస్తూ.బాదం మిల్క్   తాగి బాధలు పంచుకుంటున్నాం హేళన చేయకండి బ్రో అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ప్రస్తుతం ఆ వీడియో చూసిన వాళ్లంతా బాదం జ్యూస్ కే ఇంతలా చేస్తే నిజంగా వైన్ తాగితే ఇంకెంతలా చేస్తారు బ్రో అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.ఇక ప్రస్తుతం మెహబూబ్ తన డాన్స్ పర్ఫామెన్స్ లో బాగా బిజీగా ఉన్నాడు.

https://instagram.com/stories/mehaboobdilse/3023729951505543467?igshid=NjcyZGVjMzk=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube