టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను – మాన్‘( Hanu Man ).మన టాలీవుడ్ ఆడియెన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమాల్లో ఒకటిగా హనుమాన్ ఉండడం విశేషం.
ముందులో ఈ సినిమాపై ఇన్ని అంచనాలు లేవు.కానీ వన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యి టీజర్ రిలీజ్ తో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
అప్పటి వరకు మాములు సినిమాగా ఉన్న ఈ సినిమా టీజర్ రెస్పాన్స్ తో పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ సైతం ఫిక్స్ అయ్యి రిలీజ్ సైతం వాయిదా వేసి మరీ విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సిద్ధం చేసారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా నుండి నిన్ననే ట్రైలర్ రిలీజ్ కావడంతో అంచనాలు మరిన్ని పెరిగాయి.ట్రైలర్ ఒక అద్భుతం చూసినట్టు ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయంలో ప్రేక్షకులు తెగ చర్చించు కుంటున్నారు.
ఈ సినిమా ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్న అంశం ఎండింగ్ లో భజరంగ్ ఎంట్రీ షాట్ అనే చెప్పాలి.ఈ షాట్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.
కళ్ళు తెరిచే సన్నివేశం ఎంత పవర్ ఫుల్ గా అనిపించిందో చెప్పాల్సిన పని లేదు.అయితే ఈ పాత్ర చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది నిజమయ్యే ఛాన్స్ చాలా తక్కువ అని తెలిసిన ఈ టాక్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.చిరు హనుమాన్ లా కనిపించాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.అయితే ఇది నిజామా కదా అనే ప్రశ్న రిలీజ్ తర్వాతనే తెలియాల్సి ఉంది.ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతానికి ఈ విషయంన్ని సస్పెన్స్ గానే ఉంచాడు.కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ), వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించగా.అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు.
ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.