కమెడియన్ సుధాకర్( Comedian Sudhakar ) అంటే తెలియని ప్రేక్షకుడు లేడు అనే చెప్పవచ్చు…తెలుగులో చాలా బిజీ కమెడియన్ గా చాలా రోజులు తన హవా కొనసాగించాడు… కెరీర్ ప్రారంభంలో ఈయన అనేక తమిళ సినిమాల్లో హీరోగా నటించారు.అందులో కొన్ని హిట్ అయినా ఈయన హీరోగా నిలబడలేకపోయారు.
ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చారు.అయితే ఇతని బెస్ట్ ఫ్రెండ్ అయిన మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సినిమాల్లో చేసిన కమెడియన్ రోల్స్ ఇతనికి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టాయి…
అప్పట్లో బ్రహ్మానందం కూడా ఈయన తర్వాతే అన్నట్టు చూసేవారు ప్రేక్షకులు.
తర్వాత ఈయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఎక్కువకాలం హాస్పిటల్ కి పరిమితం కావాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.
కానీ రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.అయితే సుధాకర్ కి తన కొడుకుని ( Sudhakar Son ) సినిమాల్లోకి పరిచయం చేయాలనే ఆశ ఉందట.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చారు.“ప్రస్తుతం నేను ఇంటిపట్టునే టీవీ చూస్తూ కాలం గడుపుతున్నాను…

పాత సినిమాలు చూస్తున్నప్పుడు ‘బాగానే చేశానే’ అనుకుని సంతోషపడుతూ ఉంటాను.చాలామంది స్టార్ డైరెక్టర్స్ నా కోసం తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేసేవారు.అవి నేను స్టార్ గా ఎదగడానికి సహాయపడ్డాయి.
అలాగే మా అబ్బాయిని కూడా సినిమాల్లోకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను.హీరోగా అయితే కష్టం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయితే అతను ఎదగాలని అనుకుంటున్నాడు.అందుకే అతన్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకెళ్లి ఈ విషయం గురించి చెప్పాను…

నేను తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను’ అని నాతో చెప్పారు.అలాగే .‘మేమంతా కష్టపడి పైకి వచ్చాము .క్రమశిక్షణతో నడచుకుంటూ ఎదిగాము.నువ్వు కూడా అలాగే కష్టపడాలి.పాత సినిమాలు ఎక్కువ చూడు’ అంటూ మా అబ్బాయికి ఆయన సూచనలు ఇచ్చారు” అంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు.ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.చిరంజీవి – సుధాకర్ ఇంత మంచి స్నేహితుల అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు…
.