ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాల మీద పడ్డాడు.ఇప్పటికే లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న చిరు ఈ సినిమాతో పాటుగా మరో సినిమాపై దృష్టి పెట్టాడని టాక్.
పృధ్విరాజ్ సుకుమారన్ డైరక్షన్ లో తెరకెక్కిన బ్రో డాడీ సినిమా రీమేక్ పై మెగాస్టార్ చిరంజీవి నటించే ఛాన్సులు ఉన్నాయని టాక్.మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఇప్పటికే బడా నిర్మాణ సంస్థ కొనేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని టాక్.చిరు కూడా ఈమధ్య కొత్త కథలని ఎంకరేజ్ చేస్తున్నారు.ఆచార్య రిలీజ్ కి రెడీగా ఉండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఈ సినిమాలతో పాటుగా వెంకీ కుడుముల డైరక్షన్ లో కూడా సినిమా చేస్తారని తెలుస్తుంది.ఈ సినిమాల తర్వాత కానీ బ్రో డాడీ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరి ఈ సినిమా రీమేక్ లో మోహన్ లాల్ రోల్ చిరు చేస్తే పృధ్వి రాజ్ రోల్ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.







