మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అక్టోబర్ 5వ తారీఖున సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే విడుదల తేదీ దగ్గరకి వస్తుంది.

 Megastar Chiranjeevi God Father Movie Trailer Update , Megastar, Chiranjeevi ,-TeluguStop.com

అయినా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేయలేదు.సినిమా ప్రమోషన్ భారీగా జరగాలంటే ట్రైలర్ కాస్త ముందు విడుదల చేయాలి అనేది విశ్లేషకుల అభిప్రాయం.

కానీ మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఆశించిన స్థాయి లో జరగడం లేదు.నార్మల్గానే జరుగుతున్నాయి.

 Megastar Chiranjeevi God Father Movie Trailer Update , Megastar, Chiranjeevi ,-TeluguStop.com

కనీసం ట్రైలర్ అయినా సమయానికి వస్తుంది అనుకొని అభిమానులు ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పటి వరకు ట్రైలర్ విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అధికారికంగా లేకపోవడంతో అభిమానులు నీరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రాడ్ ఫాదర్ సినిమా యొక్క ట్రైలర్ ని అనంతపురం లో జరగబోతున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.అక్కడ విడుదల చేసిన తర్వాత యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉండనుంది.

మొత్తానికి భారీ అంచనాల నడుమ రూపొంది విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ మరి ఇంత ఆలస్యంగా వస్తుందేంటి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఆలస్యం గా వచ్చినా కచ్చితంగా అంచనాలను పెంచే విధంగా గాడ్ ఫాదర్ యొక్క ట్రైలర్ ఉంటుందని సినిమా కోసం పని చేసిన ఒక ఎడిటర్ నమ్మకంగా చెబుతున్నాడు.

ఆయన మాటలు నిజమవుతాయా సినిమా సక్సెస్ అవుతుందా ట్రైలర్ సినిమా స్థాయిని పెంచుతుందా అనేది చూడాలి.ఇక ఈ సినిమా లో నయనతార కీలక పాత్రలో నటించగా బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ గెస్ట్‌ గా కనిపించాడు.

మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube