మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ వయసులో కూడా ఆయన ఫ్యాన్స్ ను అమితంగా మెప్పిస్తున్నాడు.ఆయన నుండి ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారో అర్ధం చేసుకుని అలాంటివి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరి మెగాస్టార్ ఒకప్పటి స్టైల్ అండ్ స్వాగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు అందుకే ఆ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.
మరి ఇప్పుడు కూడా మెగాస్టార్ ఆ స్వాగ్ ను ఏ మాత్రం తగ్గకుండా మైంటైన్ చేస్తున్నాడు.మరి చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్’ ( Bhola Shankar ) ఒకటి.
ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు ఆడియెన్స్ ను సైతం మెప్పించిన ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

భోళా శంకర్ టీజర్ 24 గంటల్లోనే యూట్యూబ్ లో( Youtube ) 14 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ 1 లో కూడా ట్రెండింగ్ అవుతుంది.దీంతో ఈ టీజర్ చిరు కెరీర్ లో కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి.ఇక తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.
తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.







