రైతులకు సత్వర సేవలు అందించేందుకు కేసిఆర్ ప్రభుత్వం( CM KCR ) ధరణి పోర్టల్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.భూ రిజిస్ట్రేషన్ పనులకు సంబంధింకి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లకుండా రైతులకు సంబంధించిన అన్నీ వివరాలనుధరణి పోర్టల్ ( Dharani )ద్వారా అందుబాటులో ఉంచింది కేసిఆర్ ప్రభుత్వం.
అయితే ధరణి పోర్టల్ పై ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి.ధరణి పోర్టల్ ద్వారా కేసిఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతోందంటూ, ధరణిలో చాలా మోసాలు జరుగుతున్నాయంటూ ఇలా రకరకలుగా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ధరణి కీ సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉంటాయి.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల తరువాత ధరణిని సేవలను మరింత మెరుగు పరుస్తామని కేసిఆర్ చెబుతుంటే.ధరణిపై వస్తున్న విమర్శలను అనుకూలంగా మలుచుకునేందుకు అటు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( J.P.Nadda )ధరణి పోర్టల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాము అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిగా రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కొన్ని రోజుల ముందు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేయబోమని, కొద్దిగా మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు.దీంతో ధరణి పై కమలనాథులలోనే క్లారిటీ లేదని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.ఒకరు మార్పులు చేస్తామని చెప్పడం మరొకరేమో పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడంతో అసలు ధరణి విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో అంతు చిక్కడం లేదు.
దీంతో ప్రజల్లో కూడా బీజేపీపై అస్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది.మొత్తానికి ధరణి విషయంలో కేసిఆర్ సర్కార్ ను గట్టిగా దెబ్బతీయాలని భావించిన కమలనాథులకు.అదే ధరణి విషయంలో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు బీజేపీని చిక్కుల్లోకి నేడుతున్నాయి.మరి కాషాయ పార్టీలో ధరణి పెట్టిన మంట ఎలా చల్లారుతుందో చూడాలి.







