సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..ఈ పుట్టినరోజు ప్రత్యేకం అంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.

ఈ విధంగా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సూర్య నేడు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు.జులై 23 ఈయన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే ప్రతి ఏడాది మాదిరి కాకుండా ఈ ఏడాది సూర్యకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.ఈయన పుట్టినరోజు సందర్భంగా 68వ జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో భాగంగా నటుడు సూర్య నటించిన సూరారై పోట్రు చిత్రానికి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం.

ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు సూర్యకు ఎంతో ప్రత్యేకం అయింది.ఇకపోతే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.నా ప్రియమైన హీరో సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు మీ ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.

హ్యాపీ బర్త్ డే మీకు మరెన్నో ప్రశంసలు రావాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ఈ సందర్భంగా సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫోటో దగ్గర సూర్య దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు