Megastar Chiranjeevi: మెగాస్టార్ రేంజ్ అంటే అది.. హైదరాబాదులో ఏ ఒక్కరికీ లేని ప్రత్యేకత ఆయన సొంతం…

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) స్వయంకృషితో పైకి వచ్చాడు.ఖైదీ సినిమాతో తన సత్తా ఏంటో చాటాడు.

ఆ సినిమా నుంచి కృషి, పట్టుదల, సంకల్పంతో ఎన్నో మూవీలు చేస్తూ ఆకట్టుకోవడం ప్రారంభించాడు.బ్రేక్ డ్యాన్స్‌లు చేస్తూ నటనలో మరో లెవెల్‌కి వెళ్తూ ప్రతి సినిమాతో అలరించాడు.

చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood ) మెగాస్టార్ గా అవతరించాడు.సినిమాల్లో సక్సెస్ అవుతూనే కోట్లాధిపతి అయ్యాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంపాదించిన హీరోగా కూడా చిరంజీవి నిలుస్తున్నాడు.చిరు వాడే బట్టలు, ప్రయాణించే వెహికల్స్ చాలా లగ్జరియస్‌గా ఉంటాయి.

Advertisement

చిరు గతంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు( Rolls-Royce Phantom ) కొనుగోలు చేశాడు.దాని ధర రూ.9-11కోట్ల మధ్యలో ఉంటుంది.అయితే హైదరాబాదులో( Hyderabad ) చిరంజీవి ఒక్కడికే ఈ కారు ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి పేర్కొన్నాడు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సదరు వ్యక్తి మాట్లాడుతూ చిరంజీవి లాంటి వారికి మాత్రమే రోల్స్ రాయిస్ కంపెనీ అమ్ముతుందని చెప్పుకొచ్చాడు.

బాగా కష్టపడి, మంచి మార్గంలో డబ్బులు సంపాదించిన వారికే ఈ కంపెనీ కార్లు సేల్ చేస్తుందని అన్నాడు.ఐటమ్ సాంగ్స్ చేస్తూ సంపాదించే వారికి కూడా అమ్మరని అన్నాడు.తాను కూడా వెళ్లి అడిగితే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వారికే ఈ కార్లు అమ్ముతామని చెప్పారట.

అప్పుడే తనకి మెగాస్టార్( Megastar ) రేంజ్ ఏంటో తెలిసిందట.హైదరాబాదులో ఉన్న చిరంజీవికి తప్ప ఈ కారు ఎవరికీ లేదని, దాన్ని బట్టి చిరు రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చన్నట్లు అతను మాట్లాడాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అతడి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ కాగా దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.ఒక మనిషిగా మెగాస్టార్ చాలా గొప్పోడు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.మరి కొందరు హైదరాబాద్‌లో చిరంజీవికి ఒక్కరికే రోల్స్ రాయిస్ కారు లేదని, ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ కార్లను కొనుగోలు చేశారని అంటున్నారు.

Advertisement

కొందరు వ్యాపారవేత్తలు కూడా ఈ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేశారని అంటున్నారు.

తాజా వార్తలు