కన్నడ స్టార్ హీరో యష్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2 ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ప్రీమియర్ షోతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు తమదైన శైలిలో రివ్యూ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందించారు.
ట్విట్టర్ వేదికగా సాయితేజ్ ట్వీట్ చేస్తూ.
.కేజిఎఫ్ సినిమాతో భారతదేశం మొత్తం ఒక్కసారిగా సినిమా పేరు మారుమోగడమే కాకుండా,సినిమాను ఉర్రూతలుగించారు.
ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 తో మరోసారి భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలి అంటూ ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ చిత్ర బృందానికి మొత్తం బెస్ట్ విషెస్ తెలియజేశారు.ప్రస్తుతం ఈ సినిమా పై సాయితేజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా.రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.







