టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రాంచరణ్ ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నాడు.జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్( G20 Summit ) కోసం చరణ్ శ్రీనగర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.2019 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసింది.ఇది జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి.జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

దాంతో ప్రభుత్వం ఈ సమ్మిట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.కాగా ఈ సమావేశంలో కాశ్మీర్ ని ఫిలిం టూరిజంకి డెస్టినేషన్ గా ప్రమోట్ చేయనున్నారు.ఇతర దేశ ప్రతినిధులను జమ్మూ కాశ్మీర్లో సినిమా షూటింగ్స్ ను చేయమని ప్రమోట్ చేయమన్నాడు రామ్ చరణ్. ఈ ప్రెస్టీజియస్ చాన్స్ రాంచరణ్ కి రావడంతో మెగా అభిమానులు సంతోషపడుతున్నారు.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.







