సూపర్ స్టార్ రజినికాంత్( Rajinikanth ) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా జైలర్.( Jailer ) ఆగష్టు 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ ముందు వరకు జైలర్ మీద అసలు ఏమాత్రం అంచనాలు లేవు.తెలుగులో అయితే జైలర్ కి సరైన బిజినెస్ కూడా జరగలేదని టాక్.
ఎప్పుడైతే జైలర్ ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.జైలర్ సినిమా ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
అంతేకాదు వారిలో ఒక కొత్త టెన్షన్ మొదలైందని తెలుస్తుంది.
అదేంటి జైలర్ సినిమా ట్రైలర్ చూసి మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ ఎందుకు అనుకోవచ్చు.జైలర్ ఆగష్టు 10న వస్తుండగా నెక్స్ట్ డే అంటే ఆగష్టు 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) గా వస్తున్నాడు.చిరు చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వసతుంది.
దశాబ్ధ కాలం తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నా ఎక్కడో ఫ్యాన్స్ లో భయం అయితే ఉంది.అందులోనూ రజిని సినిమా పోటీగా వస్తుందని తెలిసి ఆ సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుందని తెలిసి మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ డబుల్ అయ్యింది.
మరి జైలర్ ఒకరోజు ముందే కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ భోళా శంకర్ మీద జైలర్ ఇంప్యాక్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు.