మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఎంతో మంది హీరో లు ఎంట్రీ ఇచ్చారు.కానీ హీరోయిన్ మాత్రం కేవలం నిహారిక అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నిహారిక మొదటి నుంచి కూడా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది.హోస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సినిమా ల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
అయితే అదృష్టం కలిసి రాకపోవడం తో నిహారిక సినిమా ల్లో ఎక్కువ కాలం లేదు.పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా లకు పూర్తిగా దూరం అయింది.
అందుకే ఇండస్ట్రీ కి ఆమె కి బంధం తెగి పోయిందని అంతా అనుకున్నారు.కానీ ఆ మధ్య వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.
వెబ్ సిరీస్ తర్వాత హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడమే అంటూ చాలా మంది మాట్లాడుకున్నారు.

నిహారిక( Niharika ) సినిమా ల్లో ఈసారి ఫుల్ స్వింగ్ తో కమర్షియల్ పాత్ర తో అందాల ఆరబోత చేసే విధంగా నటించబోతుంది అంటూ అంతా అనుకున్నారు.మెగా వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగింది.అయితే ఆ విషయమై ఇప్పటి వరకు నిహారిక నుంచి కానీ ఆమె సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు.
తెలుగు లో నిహారిక కి పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు.కానీ ఆమె కు తమిళ్( Tamil ) లో ప్రయత్నిస్తే వరుస ఆఫర్లు వస్తాయి.
ఇప్పటికే తమిళ్ లో నిహారిక నటించింది.అందుకే అక్కడ ప్రయత్నిస్తే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో హాట్ ఫోటో లను షేర్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తోంది.

ఇలాంటి సమయంలో ఆమె నటిగా ఎందుకు కనిపించడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.అయితే సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసమే అందాల ఆరబోత.అంతకు మించి సినిమాల్లో నటించాలి అనే కోరిక తనకు లేదు అన్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పిందట.
దీంతో నిహారిక సినిమా ల్లోకి రీ ఎంట్రీ( Niharika Re Entry ) అనే కథ కంచికేనా అంటూ నెటిజన్స్ మరియు మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు.