తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి హీరోగా అవకాశాలు దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపుగా సౌత్ ఇండియా లోనే తెలియనివారుండరు.అయితే మెగాస్టార్ చిరంజీవి క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం తో తన ఇద్దరు సోదరులయిన పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి బాగానే సపోర్ట్ చేశారు దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ ఐదుగురు హీరోలలో ఒకడిగా రాణిస్తున్నాడు.
ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా నటుడిగా బాగా నిలదొక్కుకొని పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం చోటు చేసుకున్న మెగా హీరోలు పంచాయతీలకు హాజరయ్యి సర్ది చెప్పిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
అయితే గత వారం రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.ఈ క్రమంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణ మురళిపై దాడికి కూడా యత్నించారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెగ కలకలం సృష్టిస్తోంది.అయితే ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇంత జరుగుతున్నప్పటికీ మెగా బ్రదర్స్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు.
అయితే ఈ ఈ విషయంపై స్పందించడం లేదు కనీసం పట్టించుకోవడం కూడా లేదు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవరైనా నా ఘాటు వ్యాఖ్యలు చేసిన విమర్శలు చేసినా అప్పుడప్పుడు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లేదా ప్రెస్ మీట్ నిర్వహించి స్పందించే వాడు.
కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కనీసం నాగబాబు కూడా స్పందించడం లేదు.దీంతో మెగా అభిమానులు కొంతమేర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కానీ మరికొందరు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దీనికితోడు పోసాని కృష్ణమురళి కూడా వైకాపా పార్టీకి సపోర్టుగా మాట్లాడటంతో చిరంజీవి ఈ విషయంపై కలగజేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇంకొందరైతే రాజకీయ వ్యవహారాలను సినిమా ఇండస్ట్రీలో చర్చించడం సరికాదని అందువల్లనే మెగా బ్రదర్స్ సైలెంట్ గా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు.