ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన 68వ పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెష్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.
మరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు( Chiranjeevi Birthday ) సందర్భంగా తమ విషెష్ తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ పుట్టిన రోజు నాడు ఆయన కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ ఉంటుంది అనే టాక్ గత కొన్ని రోజులుగా వస్తూనే ఉంది.
మరి ముందు నుండి వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ రోజు ఈయన నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ ను అఫిషియల్ గా చేసారు.మరి చిరు నటించనున్న 156వ ప్రాజెక్ట్ పై( Mega156 ) ఇప్పుడు అనౌన్స్ మెంట్ తో క్లారిటీ వచ్చేసింది.

ముందు నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై( GoldBox Entertainments ) ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ రోజు బర్త్ డే కానుకగా ఈ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉనాన్రు.ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు.డైరెక్టర్ ఎవరు అనేది అతి త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.చూడాలి డైరెక్టర్ ఎవరో.

ఇక ఇటీవలే భోళా శంకర్( Bhola Shankar ) వంటి మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.ఊహించని ఫలితంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది.ఏకంగా 50 కోట్లకు పైగానే నష్టాలు వాటిల్లాయని అంచనా.
ఇక ఈ క్రమంలోనే భోళా శంకర్ తర్వాత చిరంజీవి నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.







