వ్యవసాయంలో( Agriculture ) పంటలను పండించడంతోపాటు ఆ పంటను భద్రపరచడం కోసం ఎండబెట్టడం కూడా కీలకమే.తేమ తో ఉన్న పంటను నిల్వ చేస్తే ఆ పంట తక్కువ రోజుల్లోనే చెడిపోతుంది.
అనేక దశాబ్దాల నుండి రైతులు పంటలను ఆరబెట్టి భద్రపరచడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు.రైతులు పండించిన పంటను పంట పొలంలో, రోడ్లపై, ఇంటి వద్ద ఉండే స్థలాలలో తేమశాతం( Moisture ) పూర్తిగా పోయేవరకు ఆరబెట్టి నిల్వ చేస్తారని అందరికీ తెలిసిందే.
అయితే వర్షాకాలంలో, వాతావరణ పరిస్థితుల వల్ల ఎన్ని రోజులు ఆరబెట్టిన పంట ఆరని పరిస్థితులలో సోలార్ డ్రైయర్( Solar Dryer ) ద్వారా ఆహార పంటను ఎండబెట్టడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఆహార ఉత్పత్తులు ఎక్కువ కాలం భద్రంగా ఉండడం కోసం ఆరబెట్టి నిల్వ చేస్తారు.
ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు, టమాటాలు కోసి ధర లేకపోవడంతో పొలాల్లో, రోడ్లపై పారేసే సంఘటనలు ఇండోర్ కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజాను( Varun Raheja ) ఎంతగానో కలచివేశాయి.

పంట నిల్వకు సరైన ఉపాయం కనుగొంటే రైతుల నష్టాలు మరణాలను చాలావరకు నివారించవచ్చు అంటూ ఒక విన్నుత ఆవిష్కరణను రూపొందించాడు.కరెంటు లేని ప్రదేశాలలో కూడా ఉపయోగకరంగా ఉండడం కోసం సూర్యరశ్మితో( Sunlight ) పని చేసే సోలార్ డ్రైయర్ ను రూపొందించాడు.విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చేవరకు అంతా ప్రకృతి చేతిలోనే ఉంటుంది.
పంట చేతికి వచ్చాక వర్షాలు వస్తే చేతికి వచ్చిన పంట నేలపాలు అవ్వాల్సిందే.అయితే చేతికి వచ్చిన పంటను సంరక్షించడం కోసమే ఈ సోలార్ డ్రైయర్.

పండ్లు, కూరగాయలలో తేమను సహజంగా తొలగించగలిగితే పంట నిల్వ చేయవచ్చు.అలా చేయడం కేవలం సౌర శక్తితో( Solar Energy ) మాత్రమే సాధ్యమవుతుంది.ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్ తో పాటు 20 కిలోల నుండి 100 కిలోల కెపాసిటీ కలిగిన పోర్టబుల్ డ్రైయర్ ను రూపొందించారు.దీనిని సులువుగా ఎక్కడికైనా తీసుకు వెళ్ళవచ్చు.ఇది అన్ని రకాల పంటలకు ఉపయోగపడుతుంది.







