నటి మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ).గత కొద్ది రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాకుండా గ్లామర్ ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు.

ఆ పోస్టులో మీనాక్షి చౌదరి ఈ విధంగా రాసుకొచ్చింది.మీనాక్షిలోని అనేక షేడ్స్! గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో భావోద్వేగాలతో నా జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా( roller coaster ride ) సాగింది.ఇలాంటి దశలను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభూతి చెందలేదు.కిందపడ్డా, ప్రయత్నించా, మళ్లీ తిరిగి లేచా.ఇలా నా జీవితం సాగింది.ఆత్మపరిశీలనతో జీవితాన్ని చూసే విధానం మారింది.
ఇక, ప్రతి దశలోనూ ఈ చిరునవ్వు నాకు తోడుగా ఉంది.కాలంతోపాటు పరిస్థితులు కూడా మారతాయనే విషయాన్ని అదే నాకు అర్థమయ్యేలా చేసింది.
కాబట్టి, జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే.చిరునవ్వు చిందించిన క్షణాలు గుర్తు చేసుకోండి అని రాసుకొచ్చింది మీనాక్షి చౌదరి.

అంతేకాకుండా ఆ పోస్టుతో పాటు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.కాగా మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు, ఖిలాడీ,హిట్ 2 ( Khiladi, Hit 2 )సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.త్వరలోనే విడుదల కానున్న గుంటూరు కారం సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించనుంది.ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఆ సినిమాలకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







