దగ్గరుండి భర్త అంత్యక్రియలు చేసిన మీనా.. కారణం అదేనా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు సంపాదించుకున్న మీనా గురించి అందరికీ సుపరిచితమే.ఈమె తెలుగు తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.

 Meena Did Her Husband Funeral This Is The Reason ,meena, Tollywood, Husband Died, Husband Funeral, Reason, Telugu Film Industry , Meena Husband Funeral-TeluguStop.com

ఇకపోతే ఇండస్ట్రీలో అగ్రతాలుగా కొనసాగుతున్న సమయంలోనే మీనా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నారు.వివాహమైన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మీనా తన భర్త ప్రోత్సాహంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇక వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న మీనా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభిస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నా మీనా జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

 Meena Did Her Husband Funeral This Is The Reason ,meena, Tollywood, Husband Died, Husband Funeral, Reason, Telugu Film Industry , Meena Husband Funeral-దగ్గరుండి భర్త అంత్యక్రియలు చేసిన మీనా.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన భర్త అకాల మరణంతో ఈమె దిక్కుతోచని స్థితికి వెళ్లారు.మంగళవారం సాయంత్రం మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతూ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

ఇక విద్యాసాగర్ అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు.

మీనా తన భర్త అంత్యక్రియలను దగ్గరుండి తన చేతుల మీదుగా నిర్వహించారు.ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె మాత్రమే ఉంది.వీరికి కొడుకులు లేకపోవడంతో మీనా తానే దగ్గర ఉండి తన భర్త అంత్యక్రియలను నిర్వహించింది.

ఇలా ఈమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక కారణం ఉంది.మీనా భర్త తనని ఎంతో ప్రేమగా చూసుకోవడమే కాకుండా తనకు సినిమాలలో నటించమని ఎంతో ప్రోత్సహించారు.

ఇలా మీనా భర్త తన పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉండేవారు.అయితే మీనా సైతం తన భర్త చివరి క్షణం వరకు తన ప్రేమను చూపిస్తూ తన భర్త అంత్యక్రియలను కూడా తన చేతుల మీదుగా నిర్వహించారు.

తన భర్త అంత్యక్రియలు పూర్తి కాగానే తన చేతులతో తన భర్త చితబస్మాన్ని తీసుకువెళ్లారు.ఇలా తన భర్త పట్ల మీనా చూపించిన ప్రేమకు అందరూ ప్రశంసలు కురిపించగా, మరికొందరు తను తొందరగా ఈ బాధ నుంచి తొందరగా బయటపడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube