టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు ప్రత్యేక వైద్య బృందం ఆయనకు టెస్టులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబుకు ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.తరువాత 2డీ ఎకో లాంటి సాధారణ పరీక్షలు చేయనున్నారని తెలుస్తోంది.
వెన్నుముక సంబంధ వైద్య పరీక్షలను డాక్టర్స్ నిర్వహించనున్నారు.కాగా చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.







