లండన్‌లో అరుదైన అవకాశం పొందిన మేడ్చల్ విద్యార్థిని.. !

ప్రతిభకు ఎక్కడ అడ్డు ఉండదన్న సంగతి ఎన్నో సార్లు నిరూపించబడింది.పట్టుదల, ప్రణాళిక ఉంటే చాలు ఎన్ని కష్టాలైన ఓర్చుకుని అనుకున్నది సాధించ వచ్చూ.

ముఖ్యంగా విద్యార్ధి దశలో వేసే అడుగులు భవిష్యత్తుకు సోపానాలుగా మారుతాయని ప్రతి విద్యార్ధి గ్రహించవలసిన అవసరం ఉంది.ఈ వయస్సులో, సమయాన్ని వృధా చేస్తూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే జీవితంలో ఒక దశకు చేరుకున్నాక, గడిచిన కాలం వెనక్కు రాదు.

అప్పుడు అర్ధం అవుతుంది ఏం కోల్పోయామో.ఇకపోతే ఆదితి విఠల్‌ అనే విద్యార్ధిని లండన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ లో అడ్మిషన్‌ పొంది తన ప్రతిభను చాటుకుంది.

కొంపల్లిలోని వాస్వాని ఇంటర్నేషనల్‌ స్కూల్లో 12వ తరగతి చదువుకుంటున్న ఆదితి విఠల్‌ కు ఎల్‌ఎస్ఈ తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటో, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా, వార్విక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో అడ్మిషన్‌ లభించింది.ఈ సందర్భంగా మంచి ఆర్థికవేత్తగా ఎదగాలన్న ఆశయం తనకు ఉందని ఆదితి విఠల్‌ వెల్లడించారు చూశారా ఇది కదా విజయం అంటే.

Advertisement
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు