వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు..: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించారు.

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు.రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు.ఈ ఏడాది కొత్తగా 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్న జగన్ రానున్న రోజుల్లో మరో 2,737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Advertisement

అదేవిధంగా కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకువస్తున్నామన్నారు.వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు వస్తాయని వెల్లడించారు.

పెండింగ్ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు