మేడారం జాతర ప్రారంభం వెనుక కథ ఏమిటో తెలుసా?

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

పూర్వ కాలంలో మేడారానికి చెందిన కొందరు కోయ దొరలు గోదావరి నదీ తీరంలోని అడవికి వేటకు వెళ్లారట.

అక్కడ పులుల మధ్య ఓ పాప ఆడుకుంటూ కనిపించిందట.అయితే వాళ్లు ఆ పాపను తీసుకొచ్చి.

Medaram Jathara Special Story , Devotional, Medaram, Medarem Jatara, Samakka Sar

అల్లారు ముద్దుగా పెంచు కుంటూ సమ్మక్క అని పేరు పెట్టారట.అయితే ఆ పాప గ్రామానికి వచ్చినప్పటి నుంచి తన మహిమతో గ్రామస్థులందిరీని  సంతోషంగా ఉండేలా చేసింది.అప్పటి నుంచి వారంతా ఆమెను వన దేవతగా కొలిచేవారట.

కొన్నాళ్ల తర్వాత ఆమెకు కాకతీయుల సామంత రాజు అయిన పగిడిద్ద రాజుతో వివాహం అయింది.ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు పుట్టారు.

Advertisement

అయితే వారిలో సారలమ్మను గోవింద రాజులు పెళ్లి చేసుకున్నాడు.తర్వాత కొన్నేళ్లకు కరవు కారణంగా ఊరి వాళ్లు కాకతీయులకు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపై యుద్ధం ప్రకటించింది.

విషయం తెలిసిన గ్రామస్థులు.పోరాడేందుకు సిద్ధపడ్డారు.

ఈ యుద్ధంలో పగిడిద్దరాజు.నాగులమ్మ, సారలమ్మ, గోవింద రాజులు మేడారం సరి హద్దులోని సంపెంగ వాగు వద్ద చనిపోయారు.

తన వాళ్లందరూ చనిపోవడంతో.జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మహత్య చేసుకున్నాడట.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

విషయం తెలిసిన సమ్మక్క ఒక్కతే యుద్ధం చేసింది.చివరకు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు.

Advertisement

దీంతో రక్తం కారుతుండగానే.ఆమె చిలకల గుట్ట వైపు పరుగులు పెట్టింది.

అలా వెళ్లిన ఆమె ఓ మలుపు వద్ద మాయమైందట.విషయం తెలిసిన కోయగూడెం వాసులు దివిటీలతో గాలిస్తే గుట్ట మీదున్న నెమలి నార చెట్టు కింద పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణె కనిపించిందట.

అంతలోనే ‘ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలి.ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుస్తా.

అంటూ ఆకాశ వాణి వినిపించిందట.గిరిజనులు ఆ మాటల్నే అమ్మ ఆదేశంగా భావించి రెండు గద్దెలు నిర్మించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లకోసారి జాతరను నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు