తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన అలుపెరగని బాటసారి తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించిన గొప్ప వ్యక్తి.కేవలం నటుడుగా మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి గా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఒక మహోన్నత వ్యక్తి ఆయన.
ఆయన ఎవరో కాదు నందమూరి తారకరామారావు.ఇక అప్పట్లో హీరో అనే పదానికి ఆయన కేరాఫ్ అడ్రస్.
సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.కేవలం సినిమాల్లోనే కాదు అటు రాజకీయ పరంగా కూడా ఆయన తిరుగులేదు అని నిరూపించారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పట్లో తిరుగులేని చరిష్మా ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలందరూ తన వైపుకు తిరిగేలా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే చేసుకున్నారు.ఇక ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు.
తర్వాత ప్రజలందరికీ సుపరిపాలన అందించారు.అయితే ఒకానొక సమయంలో ఇక ఎన్టీఆర్ కేవలం కాషాయం వస్త్రాలకు మాత్రమే పరిమితమయ్యారు.
అప్పుడు వరకు అందరిలాగానే సాధారణ దుస్తులు ధరించిన ఆయన తర్వాత కాషాయ దుస్తులు ధరించడానికి కారణం ఏంటి అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

ఇంతకీ ఆ కారణం ఏమిటి అంటే మొదటిసారి తిరుపతిలో జరిగిన ఓ సినిమా అవార్డు ఫంక్షన్ కి వచ్చారు.ఇక ఆయనకు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.కొంతమంది ఇలాంటి దుస్తులు ఎందుకు ధరించారు అని అడగాలని అనుకున్నా ధైర్యం చేయలేకపోయారు.
కానీ మీడియా ఊరుకోదు కదా.ఎన్టీఆర్ వెంటపడి కాషాయం ధరించడానికి కారణం అడిగారు.

కాషాయం లోకి మారడానికి కారణం సన్యాసించటం అంటూ అభివర్ణించారు.ఎన్టీఆర్ ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఇక ఇలాంటి గెటప్ లో కి వచ్చేస్తాను అంటూ చెప్పిన ఎన్టీఆర్ ఇక తనని తాను రాజయోగిగా అభివర్ణిస్తున్నారు.అంతేకాదు హక్కుల ఉద్యమనేత స్వామి అవిగ్నేష్ ను ఇన్స్పిరేషన్గా తీసుకొని కాషాయం ధరించినట్లు చెప్పుకొచ్చారు.