రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి సంఘీభావంగా భారీ ఎత్తున లేఖలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు( Chandrabau Skill Development Scam ) లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన సిఐడి కస్టడీలో ఉన్నారు.

రెండు రోజులపాటు కస్టడీ కూడా విధించడం జరిగింది.మరోపక్క చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

చాలాచోట్ల రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.ఇదిలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail ) చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ కి సంఘీభావంగా అభిమానులు మరియు కార్యకర్తలు లెటర్స్ రాస్తున్నారు.

ఈ పరిణామంతో రాజమండ్రి స్థానిక పోస్ట్ ఆఫీస్ లో భారీ ఎత్తున లేఖలు కనిపిస్తున్నాయి.ఐ యాం విత్ సిబీయన్( I Am With You CBN ), సిబీయన్ సర్ మీరు త్వరగా బయటకు రావాలి, బాబుతో నేను అంటూ రకరకాలుగా మద్దతు తెలుపుతూ పోస్ట్ కార్డులు పంపుతున్నారు.

Advertisement

ఇదే క్రమంలో మరి కొంతమంది విపరీత భావోద్వేగానికి గురైన వాళ్ళు రక్తంతో కూడా లెటర్లు రాయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ శనివారం చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది.

వైరల్ వీడియో : అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!
Advertisement

తాజా వార్తలు