ముంబాయిలో కోవిడ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం..!!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు భారీ స్థాయిలో నమోదు కావడంతో అక్కడ ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ నైట్ పూట కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో భాండవ్ అనే ప్రాంతం వద్ద కరోనా హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.ఈ తరుణంలో 70 మంది బాధితులను హాస్పిటల్ సిబ్బంది మరో హాస్పిటల్ కి తరలించారు.

ఆసుపత్రిలో దాదాపు 76 మంది రోగులు కరోనా చికిత్స తీసుకుంటున్నారు.ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు.

ప్రస్తుతం హాస్పిటల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో కేసులు పెరుగుతూ ఉండటంతో సీఎం ఉద్దవ్ థాక్రే ఇటీవల హాస్పిటల్ సంఖ్య పెంచడం జరిగింది.

Advertisement

 దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఎక్కువగా మహారాష్ట్రలో కేసులు బయటపడ్డాయి.ఇదిలా ఉంటే మొన్నటి వరకు కరోనా కంట్రోల్ లో ఉందని అందరు అనుకున్న ప్రస్తుతం కేసులు పెరిగిపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు